
- వచ్చే నెలలో ఓపెనింగ్.. అంతలోనే ప్రమాదం.. 7 కోట్ల నష్టం
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న ఓ కన్వెన్షన్ హాల్దగ్ధమైంది. తొండుపల్లి గ్రామానికి సమీపంలో కొత్తగా ‘ఏకం’ పేరుతో కన్వెన్షన్ హాల్ నిర్మిస్తున్నారు. 80 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫినిషింగ్వర్క్స్నడుస్తున్నాయి.
వచ్చే నెలలో ఈ కన్వెన్షన్హాల్ను ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు. కాగా గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కన్వెన్షన్హాల్ తగలబడింది. మంటలకు ఈదురు గాలులు తోడవడంతో వేగంగా వ్యాపించాయి. స్థానిక పోలీసులు, రాజేంద్రనగర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాలేదు.
మరో ఫైర్ ఇంజిన్ ను తెప్పించి అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శంషాబాద్లో ఫైర్ స్టేషన్ ఉండి ఉంటే ఇంత నష్టం వాటిల్లేది కాదని కన్వెన్షన్ హాల్ యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. దాదాపు రూ.7 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని తెలిపింది. శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కేసు ఫైల్ చేశారు.