
హైదరాబాద్ లోని పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమలు ఎక్కువుగా ఉన్న జీడిమెట్ల ఓ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎస్ ఎస్ బి (SSB)ప్లాస్టిక్ పరిశ్రమలో మంగళవారం ( నవంబర్ 26) అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం ఎంతమంది గాయపడ్డారో ఇంకా సమాచారం అందలేదు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. భారీగా నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే విషయాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.