ఐదేండ్లలో 6,525 ఫైర్ యాక్సిడెంట్లు

ఐదేండ్లలో 6,525  ఫైర్ యాక్సిడెంట్లు

హైదరాబాద్‌‌, వెలుగు: సిటీలో అగ్ని ప్రమాదాలు టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించని అపార్ట్​మెంట్స్‌‌, గోదాముల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫైర్‌‌‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రమాదాలకు అడ్డుకట్టపడడం లేదు.  ఐదేండ్ల వ్యవధిలో హైదరాబాద్‌‌ సిటీలో 6,525 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. రూ.120.83కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగింది. తాజాగా నాంపల్లిలో జరిగిన ప్రమాదంతో ఈ ఏడాది ఘటనల్లో మృతుల సంఖ్య 15కు చేరింది. గతేడాది 1,377  జరగ్గా 20 మంది మృతి చెందారు. రూ.50.41కోట్లు ఆస్తినష్టం జరిగింది.

ఆర్టీఐతో బట్టబయలు..

నాంపల్లి బజార్‌‌‌‌ఘాట్‌‌లో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 9మంది మృతి చెందినది తెలిసిందే. సిటీలో  వరుస అగ్నిప్రమాదాలపై సోషల్ యాక్టివిస్ట్‌‌ కరీం అన్సారీ వివరాలు సేకరించాడు. వాటిని  రాష్ట్ర ఫైర్‌‌‌‌ సర్వీసెస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ వెల్లడించింది. 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్‌‌ 31‌‌ వరకు జరిగిన అగ్నిప్రమాదాల్లో ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు తెలిపింది. అక్టోబర్‌‌‌‌ 31 నాటికి సిటీలో 1091 అగ్నిప్రమాదాలు జరిగితే  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రూ.23.55కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించింది.

ALSO READ: సపోర్ట్ చేస్తలే.. ప్రచారానికి పోతలే! .. శేరిలింగంపల్లి బీజేపీలో వర్గపోరు