స్థంభాన్ని ఢీకొట్టిన విమానం...కారుపై కుప్పకూలిన పైలట్

చిలీ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ స్తంబానికి విమానం ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్‌ మృతి చెందాడు. చిలీలోని పంగులెమో విమానాశ్రయం (TLX) సమీపంలో ఈ విమానం కూలిపోయింది. సెంట్రల్ చిలీలోని తాల్కాలో ప్రమాదం జరిగింది.

 చిలీలోని టాల్కా న‌గ‌రంలో ఓ విమానం విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైల‌ట్ మృతి చెందాడు. మ‌రో న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన పైల‌ట్‌ను ఫెర్నాండో సోల‌న్స్ రోబెల్స్‌(58)గా గుర్తించారు. ప్రమాదానికి గురైన విమానాన్ని ఫైర్‌ఫైట‌ర్ ప్లేన్‌గా గుర్తించారు. ఈ ప్రమాదాన్ని చిలీ వ్యవ‌సాయ మంత్రిత్వ శాఖ ధృవీక‌రించింది.మృతుడు నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ (CONAF)లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫైర్‌ఫైట‌ర్ విమానం అగ్నిప్రమాదాల‌ను నియంత్రించేందుకు ఉప‌యోగిస్తుంటారు. అయితే ఈ విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్రమాదంతో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో కారులో వెళ్తున్న న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతి చెందిన పైలట్‌కు అపార అనుభవం ఉందని, ప్రమాదం ఎలా జరిగిందో అర్ధంకావడం లేదని CONAF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ లిటిల్ మీడియాకు తెలిపారు. ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఆండీస్ స్పా కంపెనీ ఈ విమానాన్ని నడుపుతోంది

CONAF తెలిపిన వివరాల ప్రకారం

 ఐరెస్ టర్బో ట్రష్ విమానం జనవరి 15న సాయంత్రం 4:30 గంటల సమయంలో అగ్ని నియంత్రణ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. అయితే ఈ విమానం హైవేపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో మంట‌లు చెల‌రేగాయి. విమానం రెక్కలు రెండు యుటిలిటీ పోల్స్ మధ్య వేలాడుతున్నట్లు కనిపిస్తోన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విమాన ప్రమాద సయయంలో హైవేపై వెళ్తున్న కారు కూడా ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. ప్రమాదంపై CONAF దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి గల కారణమేమిటో తెలుసుకోవడానికి అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది.