హైదరాబాద్: సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి మార్కెట్ యార్డ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. వెంకట లక్ష్మీ కూరగాయల దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలికి చేరుకుని అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దుకాణంలో ఎవరు లేకపోవడంతో ఏలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. దుకాణంలో ఉన్న సామాగ్రి, కూరగాయలు దగ్ధమైయ్యాయి.