చందానగర్లో అగ్ని ప్రమాదం..పూర్తిగా దగ్ధమైన థియేటర్

చందానగర్లో అగ్ని ప్రమాదం..పూర్తిగా దగ్ధమైన థియేటర్

హైదరాబాద్ చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఐదవ అంతస్థులో ఉన్న  గంగారం జేపీ సినిమాస్ లో మంటలు చెలరేగాయి.  ఐదు స్క్రీన్ లలో పర్నిచర్,స్క్రీన్లు పూర్తిగా దగ్ధం అయిపోయాయి. సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెస్తున్నాయి.  ఎవరికి  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ,అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకున్న పరిస్థితిని సమీక్షిస్తున్నా రు.  షాపింగ్ మాల్ కు ఫైర్ ఎన్ఓసీ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.  అనుమతులు లేకుండానే  జేపీ సినిమాస్ యాజమాన్యం సినిమాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.