ఫిల్మ్నగర్ ఫిల్మ్ఛాంబర్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ ఫిల్మ్ ఛాంబర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిల్మ్ ఛాంబర్ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఫిల్మ్ ఛాంబర్ లో నిర్వహిస్తునన్ స్వరుచి హోటల్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి.  సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పేశారు. ఫిల్మ్ ఛాంబర్ మెయిన్ రోడ్డుపై ఉండటంలో పొగతో వాహనాలు ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

ALSO READ :- Mrunal Thakur: మృణాల్ సాష్టాంగ నమస్కారం..మరోసారి తెలుగు ఫ్యాన్స్ ఫిదా