ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం

ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం
  •  పెద్దఎత్తున ఎగసిపడ్డ మంటలు
  •   ఫరూక్​ నగర్​లో ఘటన

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారంలోని బీఆర్​యస్ రిఫైనరీ ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో మంగళవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటలపాటు శ్రమించి నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఈ సమయంలో షిఫ్ట్ లో 30 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఎవరికి ఎలాంటి హానీ జరగలేదు.