
- భయాందోళనకు గురైన స్థానికులు
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారంలో శనివారం ఉదయం భాగ్యనగర్వంట గ్యాస్పైప్లైన్లీక్ అయింది. భారీ శబ్ధంతో గ్యాస్వెలువడడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము రేగింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ఎదురుగా నర్సాపూర్హైవే పక్కన ఓ మహిళ వైభవ్ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తోంది. రెస్టారెంట్ ముందు ఉన్న చెట్టును కొన్నాళ్ల కింద కొట్టేయగా మోడు మిగిలింది.
నిర్వాహకురాలు శనివారం ఉదయం జేసీబీ సాయంతో చెట్టు మోడును తొలగించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో భూమిలోని భాగ్యనగర్వంట గ్యాస్పైప్లైన్కు తగిలి లీకేజీ ఏర్పడింది. ఒక్కసారిగా గ్యాస్‌లీకై ఆ ప్రాంతమంతా వ్యాపించింది. స్థానికులు, వాహనదారులు బయపడిపోయారు. సమాచారం అందుకున్న సూరారం సీఐ భరత్‌కుమార్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అటు వైపు ఎవరూ రాకుండా చూశారు.
అగ్నిమాపక సిబ్బందిని, భాగ్యనగర్గ్యాస్నిర్వాహకులను రప్పించి పైప్‌లైన్‌కు రిపేర్లు చేయించారు. లీకేజీకి అడ్డుకట్ట వేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్లీకైన టైంలో నిప్పు అంటుకున్నట్లయితే భారీ ప్రమాదం జరిగి ఉండేది.