నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం..

నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం..

యూపీ ఘజియాబాద్  ట్రోనికా సిటీ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. నాలుగు అంతస్తులున్న కంపెనీలో పై రెండు అంతస్తుల్లో ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి

 స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనలో ప్రాణనష్టం,ఆస్తినష్టం గురించి  తెలియాల్సి ఉంది.   జూన్ 15న  మధ్యాహ్నం 12.30 గంటలకు, సెక్టార్ 67లోని ప్లైవుడ్ గోడౌన్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బందికి ఒక కార్మికుడు ఫోన్ చేశారని ఫేజ్ 3 ఫైర్ ఆఫీసర్ యోగేంద్ర ప్రసాద్ తెలిపారు.