నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్కూల్లో అగ్ని ప్రమాదం

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ స్కూల్లో అగ్ని ప్రమాదం
  • ఫర్నిచర్​, విలువైన ఫైళ్లు బూడిద

నిజామాబాద్, వెలుగు : నగరంలోని ఖిల్లా గవర్నమెంట్​ హైస్కూళ్లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో​ కుర్చీలు, బెంచీలు కాలిబూడిదయ్యాయి. బుక్స్​తో పాటు విలువైన రికార్డులు మంటలకు ఆహుతయ్యాయి.  ఫైర్‌‌‌‌ ఇంజిన్ వచ్చి దట్టంగా వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చే లోపు నష్టం జరిగిపోయింది.  పోకిరీలు తెరిచి ఉన్న కిటికీల నుంచి పేపర్​ కాల్చి లోపల పడేసి ఉంటారని ​అనుమానిస్తున్నారు.