కంచుకోట రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం

కంచుకోట రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం
  •  ఫర్నిచర్, రెండు బైకులు, 
  •  ఇతర సామగ్రి దగ్ధం 
  • షార్ట్​సర్క్యూట్​ వల్లే ప్రమాదం

కూకట్​పల్లి, వెలుగు : కేపీహెచ్​బీ పీఎస్​పరిధిలోని కంచుకోట రెస్టారెంట్​లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో రెస్టారెంట్​లోని ఫర్నిచర్​, ఇతర సామాగ్రి కాలిపోయాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. కేపీహెచ్​బీ పరిధి అడ్డగుట్ట సొసైటీలోని అర్జున్​ థియేటర్​ సమీపంలో కంచుకోట రెస్టారెంట్​ఉంది.

గురువారం తెల్లవారుజామున 3.30 గంటలకు అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. ఆ టైంలో రెస్టారెంట్​లోనే పడుకున్న సిబ్బంది గమనించి బయటకు వచ్చారు. రెస్టారెంట్​లోని ఫర్నిచర్​తో పాటు రెండు బైకులు, ఫ్రిజ్, ఏసీ, వంట సామగ్రి కాలిపోయాయి. కేపీహెచ్​బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.