ఉప్పల్: హైదరాబాద్ ఉప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉప్పల్ భగయత్ శిల్పారామం వద్ద మూర్తి కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పత్తి, ఫోంకి సంబంధించిన పరుపులు, దిండ్లు, ఇతర మృదువైన వస్తువులు మంటలకు ఆహుతి అయ్యాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఉప్పల్ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండటం స్థానికులను కలవరపాటుకు గురిచేస్తుంది.
ఉప్పల్లోని శ్రీ భాగ్య రెస్టారెంట్ అండ్ బార్లో డిసెంబర్ 2024లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ సమయంలో రెస్టారెంట్లో గానీ, బార్లో గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిటీలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ALSO READ | గచ్చిబౌలిలో కాల్పుల ఘటన.. దండుపాళ్యం గ్యాంగ్ కంటే డేంజర్గా ఉన్నాడుగా..!
సిటీలోని జీడిమెట్ల, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు జిన్నారం, గుమ్మడిదల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాలతో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో తరచూ రియాక్టర్లు పేలడం, షార్ట్ సర్క్యూట్స్ వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో కార్మికులు ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడినవారు గాయాలపాలవుతున్నారు.
గ్యాస్, బయో ఫ్యుయల్ఆధారిత ఫ్యాక్టరీల్లో గ్యాస్ చాంబర్, రియాక్టర్లు, కెమికల్వేస్టేజ్, విషవాయువులు నిండి రియాక్టర్లు పేలడం, గ్యాస్ లీక్ అవడం, షాక్ సర్క్యూట్స్ వంటి ఘటనలు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. కెమికల్ ఫ్యాక్టరీల్లో పని చేయించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్స్కిల్డ్ లేబర్‌తో పని చేయించుకుంటున్నారు. దీంతో వీరికి సరైన అవగాహన లేక అత్యవసర టైంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు.