
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రధాన ఎర్త్ డ్యాం వద్ద బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాయింట్ నుంచి శివుడి పార్క్ వరకు ఎర్త్ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గత నెల 15, 21 తేదీల్లో డీఫారెస్ట్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. తాజాగా మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.