పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..చెలరేగిన మంటలు

పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం..చెలరేగిన మంటలు

హైదరాబాద్ పంజాగుట్ట  నిమ్స్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది.  హాస్పిటల్ లోని ఎమర్జెన్సీ బ్లాక్ ఐదవ అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో నిమ్స్   పరిసర ప్రాంతాల్లో  దట్టమైన పొగలు అలుముకున్నాయి. అందరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆస్పత్రిలోని రోగులు బయటకు పరుగులు తీశారు. ఏమవుతుందో తెలియని పరిస్థితిలో అయోమయానికి గురయ్యారు.

 అధికారుల సమాచారంతో వెంటనే  ఘటనా స్థలానికి వచ్చి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.   అగ్ని ప్రమాద ఘటనలో  ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం.  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read:-న్యాయం చేయకపోతే నార్సింగ్​ పీఎస్​ ఎదుటే ప్రాణాలు విడుస్తా..!

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ నిమ్స్ ఆస్పత్రికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా రోగులు తరలివస్తుంటారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు.