కూకట్​పల్లి పల్లవి రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం

 కూకట్​పల్లి పల్లవి రెస్టారెంట్​లో అగ్నిప్రమాదం

కూకట్​పల్లి, వెలుగు:  హైదరాబాద్ కూకట్​పల్లి వివేకానందనగర్ లోని పల్లవి రెస్టారెంట్​లో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది శ్రీనివాస్​ఆర్పేందుకు ప్రయత్నించగా స్వల్ప గాయాలయ్యాయి. నేమ్ ​బోర్డులో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్​సర్య్కూట్​కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.