Mahakumbh Mela : కుంభమేళాలో మళ్లీ మంటలు.. శంకరాచార్య రోడ్డులో అగ్నిప్రమాదం

Mahakumbh Mela : కుంభమేళాలో మళ్లీ మంటలు.. శంకరాచార్య రోడ్డులో అగ్నిప్రమాదం

మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం. సెక్టార్ 18లోని శంకరాచార్య మార్గ్ లో మంటలు చెలరేగాయి. 2025, ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో.. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఈ మంటలు వ్యాపించాయి. పదుల సంఖ్యలో టెంట్లు అగ్నికి ఆహూతి అయ్యాయి. 

సెక్టార్ 18లోని శంకరాచార్య మార్గ్ లోని శిబిరాల్లో అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఫైర్ ఇంజిన్లు పెద్ద సంఖ్యలో స్పాట్ కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని.. భక్తులు అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. 

Also Read :- నాన్న, కొడుకు.. ఇద్దరికీ ఒకేసారి గుండెపోటు

శిబిరాల్లో వంట చేస్తున్న సమయంలో మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది వేగంగా స్పందించటంతో.. ఎలాంటి నష్టం జరగలేదని.. భక్తుల కోసం ఏర్పాటు చేసిన కొన్ని టెంట్లు మాత్రమే తగలబడ్డాయని వెల్లడించారు ఖాక్ చౌక్ పోలీసులు. ఓల్డ్ జీటీ రోడ్డులోనరి తులసి చౌరాహా సమీపంలోని శిబిరంలో ఈ ప్రమాదం జరిగిందని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.