సితార ఎక్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం

సితార ఎక్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం

విజయవాడ సితార ఎక్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు పరుగులు తీశారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపిస్తుండటంతో చుట్టు పక్కల ఉన్న నివాసం ఉన్న స్థానికులు ఇళ్ల నుంచి బయటికి వచ్చారు. ప్రదర్శన కోసం ఉంచిన పక్షులు, జంతువులు మంటల్లో చిక్కుకున్నాయి. 

షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతుండటంతో వెంటనే తేరుకున్న సిబ్బంది.. పక్షులు, జంతువులను అక్కడి నుండి తరలించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. 

ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.