హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్.. రూ.4 లక్షలు ఆస్తి నష్టం

  • రూ.4 లక్షలు ఆస్తి నష్టం 

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం మార్కెట్ ఏరియాలోని శ్రీరక్షా హాస్పి టల్ లో మంగళవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆపరేషన్  సామగ్రి దగ్ధమైంది.  ఆపరేషన్ థియే టర్ నుంచి పొగలు రావడాన్ని సిబ్బంది గుర్తించారు. 

ఫైర్ సిలిండర్స్ సాయంతో మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత ఫైర్​సిబ్బంది అక్కడి చేరుకున్నారు. అప్పటికే థియేటర్​లోని కాట్రా మిషన్ తో పాటు మరిన్ని వస్తువులు దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు డాక్టర్​ రాంప్రసాద్ మీడియాతో తెలిపారు.