
కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లిలోని శ్రీరామ్చిట్స్ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్‌సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బీజేపీ ఆఫీస్సమీపంలోని క్రోమా బిల్డింగ్ మూడో అంతస్తులో శ్రీరామ్ చిట్స్ బ్రాంచ్కొనసాగుతోంది.
శనివారం ఉదయం 9 గంటలకు ఆఫీసులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆఫీసులోని రూఫ్, ఫర్నిచర్దగ్ధమైంది. షార్ట్సర్క్యూట్కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదైంది.