తాటిపల్లి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం

తాటిపల్లి రెసిడెన్సీలో అగ్నిప్రమాదం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణంలోని తాటిపల్లి రెసిడెన్సీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పొగలు రావడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షార్ట్​ సర్క్యూట్​ మూలంగానే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా రెసిడెన్సీ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

ఫైరింజన్​ వచ్చి మంటలు ఆర్పుతుండగానే వెహికల్​లోని నీళ్లు అయిపోయాయి. నీళ్ల కోసం ఫైరింజన్​ వెళ్లి వచ్చే సరికి పొగలు భారీగా వస్తుండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళనకు గురయ్యారు. హోటల్, లాడ్జీలో ఉన్న వారంతా ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు.