జగిత్యాల జిల్లాలో షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుగ్గారం మండలంలోని వెలుగొండ గ్రామంలో సెసరి అశోక్, సెసరి పాండుకు అనే ఇద్దరి వ్యక్తులకు చెందిన రెండు ఇళ్లు మంటల్లో కాలి బూడిదైపోయాయి. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.
పట్టపగలు ఒక్కసారిగా రెండు ఇండ్లలో నుంచి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా.. లేకపోతే ఇంకేదైనా కారణం ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.