- రూ.కోటిన్నర విలువైన ఆస్తి నష్టం
సూర్యాపేట, వెలుగు : షార్ట్ సర్క్యూట్ తో ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని దూరజ్ పల్లిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దూరాజ్ పల్లి వద్ద జయశంకర్ పాలిమర్స్ ప్లాస్టిక్ గ్లాస్ ల తయారీ గోదాంలో ఆదివారం షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో గోదాంలో పేపర్ ప్లేట్స్ కు సంబంధించిన ముడి సరుకులు, మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొన్న మంటలు అదుపు చేశారు. గోదాంలో 40 టన్నుల విలువైన సామగ్రితోపాటు మిషన్లు పూర్తిగా కాలిపోయాయి. మొత్తం రూ.కోటిన్నర నష్టం వాటిల్లిందని గోదాం యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.