భైంసా అగ్రికల్చర్ ​గోదాంలో ఫైర్..ఘటనపై కలెక్టర్ ఆరా

భైంసా అగ్రికల్చర్ ​గోదాంలో ఫైర్..ఘటనపై కలెక్టర్ ఆరా

భైంసా, వెలుగు: భైంసా పట్టణంలోని వ్యవసాయ శాఖ గోడౌన్​లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం వెనక భాగం నుంచి పొగలు వచ్చి మంటలు వ్యాప్తించాయి. పక్కనే ఉన్న దుకాణాల వారు గమనించి వ్యవసాయ అధికారులకు, ఫైర్​స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పేందుకు ప్రయత్నించినా అన్ని వైపులా గోడౌన్​ మూసి ఉండడంతో సాధ్యం కాలేదు.

దీంతో మున్సిపల్ ​శాఖను సంప్రదించగా.. వారు వచ్చి జేసీబీ ద్వారా గోదాం ఇనుప గేటును తొలగించడంతో ఫైర్ సిబ్బంది లోపలికి చేరుకొని మంటలను అర్పివేశారు. అప్పటికే అందులోని వ్యవసాయ శాఖ రాయితీ పురుగు మందులు, పనిముట్లతో పాటు ఇతర సామాన్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కలెక్టర్ అభిలాష అభినవ్​ అధికారులను ఆరా తీశారు. ఘటనపై పూర్తి వివరాలు అందించా లని తహసీల్దార్​ప్రవీణ్​ కుమార్​ను ఆదేశించారు. దీంతో ఆయన విచారణ జరుపుతున్నారు.