
బీహార్: పాట్నా-జార్ఖండ్ ప్యాసింజర్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2024, జూన్ 6వ తేదీ గురువారం రాత్రి లఖిసరాయ్ లోని రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్‌లలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ వేగంగా వ్యాపించాయి. దీంతో రెండు రైలు కోచ్‌లు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.