
ఎల్బీనగర్, వెలుగు: హయత్ నగర్ సామనగర్లోని స్క్రాప్గోడౌన్లో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి, గోడౌన్ దగ్ధమైంది. ఎండిన ఆకులు, చెత్తకు అంటుకొని, మంటలు చుట్టుపక్కల వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదానికి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ప్రమాదవశాత్తూ జరిగిందా? మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గోడౌన్లో కార్మికులు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని, సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని సీఐ నాగరాజు తెలిపారు.