రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం 

 రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రమాదం 

 చౌటుప్పల్, వెలుగు : రన్నింగ్ కారులో మంటలు చెలరేగిన ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ కాలనీకి చెందిన దేవబత్తు నాగ సురేశ్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండగకు సొంతూరైన ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణాజిల్లా గుడివాడకు వెళ్లారు. ఆదివారం హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో రాగానే కారు ఇంజన్​లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన వెంకటేశ్వర్లు కారు ఆపి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ట్రాఫిక్ పోలీసులు గమనించి వెంటనే  ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారి వచ్చి మంటలు ఆర్పివేశారు. కారులో ఉన్న వారికి ఎవరికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.