కూకట్ పల్లి PS పరిధిలో భారీ అగ్ని ప్రమాదం.. రెస్టారెంట్‎లో ఎగిసిపడ్డ మంటలు

కూకట్ పల్లి PS పరిధిలో భారీ అగ్ని ప్రమాదం.. రెస్టారెంట్‎లో ఎగిసిపడ్డ మంటలు

హైదరాబాద్: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (మార్చి 14) తెల్లవారుజూమున వివేకానంద నగర్‎లోని పల్లవి రెస్టారెంట్‎లో మంటలు ఎగిసిపడ్డాయి. రెస్టారెంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీశారు. రెస్టారెంట్లో కస్టమర్లు లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో పెను ప్రమాదంతో తప్పింది. దీంతో అధికారులు, రెస్టారెంట్ యజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.