
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. శుక్రవారం (ఏప్రిల్ 4) రెండో బ్లాక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ప్రమాదం జరగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి మంటలార్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ని ప్రమాద సమయంలో సైరన్ మోగకపోవడంత అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన ప్రమాదమా, ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ అలారం సైరన్ సాంకేతిక కారణాలతోనే మోగకపోయి ఉండవచ్చునని అనుకుంటున్నారు. ఇదే బ్లాక్ లో పయ్యావుల, పవన్, ఆనం, కందుల దుర్గేశ్, అనిత పేషీలు ఉండటం ఆందోళన కలిచించే అంశం. ప్రమాద స్థలాన్ని సీఎం పరిశీలించనున్నారు.