సిరిసిల్ల లో వలస కూలీల గుడిసెలు దగ్ధం

సిరిసిల్ల లో వలస కూలీల గుడిసెలు దగ్ధం
  • రూ.5 లక్షలు ఆస్తి నష్టం

సిరిసిల్ల టౌన్, వెలుగు:  పట్టణంలోని సాయినగర్ లో ప్రమాదవశాత్తు వలస కూలీల చెందిన 14 గుడిసెలు దగ్ధం అయ్యాయి. ఫైర్  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..  ఛత్తీస్ గఢ్ కు  చెందిన  కూలీలు ఏడాది కాలంగా   గుడిసెలు వేసుకుని  ఉంటున్నారు. ఆదివారం అందరూ  పనికి వెళ్ళారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

 ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ. 5లక్షల వరకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో వ్యక్తులు ఎవరూ  లేకపోడంతో  ప్రాణ నష్టం జరుగలేదు.  ఇంట్లో వంట సామన్లతో  సహా దాచుకున్న డబ్బులు కూడా కాలిపోయాయని బాధితులు తెలిపారు. తమకు సహాయం అందించాలని  ప్రభుత్వాన్నికోరారు.