సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది.  వెంటనే రైల్వే సిబ్బంది, అధికారులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. డిసెంబర్ 10వ తేదీ ఆదివారం  సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.  యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగి బోగిల్లో పోగలు అలుముకోవడంతో  ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.   అప్రమత్తమైన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపేసి.. ప్రయాణికులు కిందకు దింపారు.  

అనంతరం  రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న  అధికారులు.. రైలు బ్రేక్‌ లైనర్స్‌ పట్టేయడంతోనే మండలు చెలరేగినట్లు గుర్తించి.. సాంకేతిక లోపాన్ని సరి చేసి రైలును యధావిధిగా పంపించారు.  ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో  రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.