
- పక్కనే ఉన్న మెకానీక్ షాప్లో ఐదు బైక్లు దగ్ధం
బషీర్బాగ్, వెలుగు: గోషామహల్ గొడేకికబర్ చౌరస్తాలోని స్వీట్స్ తయారీ గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాత్రి షాపు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి భారీ శబ్దంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మెకానీక్ షాప్ కు మంటలు వ్యాపించడంతో సర్వీసింగ్ కు వచ్చిన 5 బైక్ లు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా
తీస్తున్నారు.