42వ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ : గేటెడ్ కమ్యూనిటీ జనం పరుగులు

42వ అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ : గేటెడ్ కమ్యూనిటీ జనం పరుగులు

ముంబై బైకులాలో 52 అంతస్థుల భవనంలోని 42వ అంతస్తులో ఉదయం 10.45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ముంబై మున్సిపల్ ఘటనని ఫైర్ సిబ్బంది (MFB) కు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో లెవల్ 1 అత్యవసర పరిస్థితిని తెలియజేసింది. ప్రస్తుతం (వార్త రాసే సమయానికి)   మంటలు ఉద్రిక్తంగా ఉండటంతో దట్టంగా పొగలు అలముకున్నాయి. జనాలు పరుగులు తీశారు. స్థానికులు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరికి గాయాలు కాలేదని సమాచారం. ఇంకా ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.  

ముంబైలోని బైకుల్లాలోని సాల్సెట్ 27 భవనంలోని 42వ అంతస్తులో మంటలు

📹 సల్మాన్ అన్సారీ #Fire #Byculla #Mumbai #Mumbainews #FPJ pic.twitter.com/eKDsfcHGDq

— ఫ్రీ ప్రెస్ జర్నల్ (@fpjindia) ఫిబ్రవరి 28, 2025

ఇంతవరకు అగ్ని ప్రమాదానికి కారణం తెలియలేదు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఐదు ఫైరింజన్లు, మూడు జంబో ట్యాంకర్లు, ఒక అధునాతన నీటి ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. మంటలను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది అధునాతన పరికరాలు మరియు సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ముందస్తు చర్యగా రెండు అంబులెన్స్‌లను ఘటనా ప్రాంతంలో సిద్దంగా ఉంచారు. భవనంలోని వారిని వెంటనే ఖాళీ చేయించారు.. ఎవరూ చిక్కుకోకుండా అత్యవసర సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు.స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.