గోడౌన్‌లో మంటలు.. కాలిపోయిన పత్తి..20 కోట్లు నష్టం

  •     5200 బేళ్లు దగ్ధం.. రూ. 20 కోట్లు నష్టం

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకుల సోమరం శివార్లలోని గోడౌన్ సముదాయంలో సోమవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా  దట్టమైన పొగలతో నిండిపోయింది. మంటల వేడికి గోదాము గోడలకు పగుళ్లు వచ్చి కూలిపోయాయి. ఇందులో 4వ గోదాములో నిలువ ఉన్న కాటన్​ కార్పొరేషన్​ఆఫ్​ఇండియాకు చెందిన దాదాపు 5200 పత్తి బేళ్లు కాలిపోయాయి.  

మంటలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి నుంచి సమాచారం అందుకున్న ఫైర్​ డిపార్ట్​మెంట్​ స్టాఫ్​ మూడు వెహికల్స్​లో హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.   దాదాపు రూ. 20 కోట్ల విలువైన పత్తి కాలిపోయినట్లు అధికారులు అంటున్నారు.