- 20 బైక్‌లు దగ్ధం
గండిపేట, వెలుగు: హైదర్ గూడ నలందనగర్‌లోని ఏడీఎం ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దాదాపు 20 ఈ బైక్‌లు కాలిబూడిదయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఈ షోరూమ్ ఉండగా, స్వల్పంగా మంటలు చెలరేగిన వెంటనే అపార్ట్మెంట్ బిల్డింగ్ వాసులను బయటకు పంపించేశారు.
స్థానికులు రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సుమారు రూ.కోటి ఆస్తినష్టం జరిగినట్లు అంచనా. షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.