
మహబూబాబాద్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కేసముద్రంలో మహదేవ్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ధాన్యం బస్తాలు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి.