
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ డీ ఫారెస్ట్ పరిధిలో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. పది రోజుల వ్యవధిలో సాగర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మూడోసారి అగ్నిప్రమాదం జరగడం అటవీశాఖ అధికారులకు సవాల్ గా మారింది. ఎండల తీవ్రత పెరగడంతో చిన్న నిప్పు రవ్వ పడినా మంటలు చెలరేగుతున్నాయి. ఎండిన గడ్డి ఉండడంతో క్షణాల్లో మంటలు వ్యాపిస్తున్నాయి. శనివారం నాగార్జునసాగర్ అటవీ డివిజన్ నెల్లికల్ సమీపంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
అటవీ ప్రాంతానికి పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో చెత్తను తగలబెట్టడంతో నిప్పు రవ్వలు పడివందల ఎకరాల్లో మంటలు వ్యాపించాయి.సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.