జగిత్యాల జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ధర్మపురి పట్టణం పటేల్ చౌరస్తాలోని మహంకాళి కృష్ణ కిరాణా షాపులో షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది. షాపులోని రూ. 4లక్షల సమాన్లు దగ్ధం అయ్యాయని షాపు యజమాని వాపోయాడు. ఘనటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.