కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం

ఎండాకాలం వచ్చింది ఎండలు మండుతున్నాయి. ఎందుకైనా మంచిది వాహనదారులు అలర్ట్ గా ఉండాలి.కారణాలు ఏవైనా  ఈ మధ్య రోడ్లపైనే రన్నింగ్ లో ఉండగా కారులో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.మార్చి 6న  హైదరాబాద్ లక్డీకపూల్ లోని ఓ పెట్రోల్ బంక్ ఎదుట రోడ్డుపై  కారు తగలబడి పోయింది.   ఉన్నట్టుండి ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు దిగడంతో ప్రమాదం తప్పింది. లేటెస్ట్ గా జగిత్యాల జిల్లాలో  అలాంటి ఘటనే జరిగింది.

జగిత్యాల జిల్లా  కథలా పూర్ మండలం   కోరుట్ల -వేములవాడ రూట్ లో పోసానిపేట్ దగ్గర కారులో మంటలు చెలరేగాయి.  ఆర్మూర్ నుంచి వేములవాడ దర్శనానికి   వెళ్తున్న కారులో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో  మంటలు రావడంతో కిందకు దిగారు కారులోని కుటుంబ సభ్యులు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  కారు పూర్తిగా దగ్ధమై పోయింది. 

ALSO READ :- Vivo రెండు V30 Series స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వివరాలివిగో..