అమ్రాబాద్ ఫారెస్ట్ లో మరోసారి చెలరేగిన మంటలు..

అమ్రాబాద్ ఫారెస్ట్ లో మరోసారి చెలరేగిన మంటలు..

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం జిలుగాయకుంట  ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో  మంటలు చుట్టుముట్టడంతో ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్ల పొడవు అడవి కాలిపోయింది. ఘటనా స్థలానికి వచ్చిన  ఫారెస్ట్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.

ఏప్రిల్ 18న అమ్రాబాద్  రిజర్వ్ టైగర్ అటవి ప్రాంతంలో అడవి కాలిపోతున్నట్లు ఫారెస్ట్ సిబ్బందికి శాటిలైట్ ద్వారా  సమాచారం అందింది. సిబ్బంది అక్కడికి వెళ్లి సుమారు 12 గంటలు శ్రమించి  మంటలను అదుపులోకి తెచ్చారు. మరోసారి ఇవాళ ఫారెస్ట్ లో అగ్గిరాజేసింది.