- కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నిచర్, రికార్డులు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా హెడ్ పోస్ట్‌ఆఫీస్‌లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ఆఫీస్ఆవరణలో ఉన్న పాత బిల్డింగ్‌లో పాస్‌పోర్ట్, ఈ సేవా ఆఫీస్ ఉంది. ఈ బిల్డింగ్‌లో ఆకస్మాతుగా మంటలు చెలరేగడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులు, ఫైర్ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. అప్పటికే మంటలు చెలరేగి రూమ్స్‌లో ఉన్న కంప్యూటర్స్, ఫర్నిచర్, రికార్డులు కాలిపోయాయి.
ఫైర్‌సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే చాలా వరకు నష్టం వాటిల్లింది. మంటల్ని అర్పడంతో మెయిన్ఆఫీస్కు నష్టం జరగలేదు. షాట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు వివరాలు సేకరించారు.