రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ లో అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ నగర్ లోని ఓ డ్రమ్స్ కంపెనీలో మంటలు చెలరేగాయి. మంటలతో పాటు నల్లటి పొగ దట్టంగా అలుముకున్నాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రెండు గంటలు శ్రమించి మంటలను ఆర్పారు. కేసు నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ ఘాతంతో అగ్నిప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి గురైన పరిశ్రమకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు.