షార్ట్ సర్క్యూట్​తో ఇండ్లల్లో మంటలు..ముషీరాబాద్, అల్వాల్​లో ఘటనలు

 షార్ట్ సర్క్యూట్​తో ఇండ్లల్లో మంటలు..ముషీరాబాద్, అల్వాల్​లో ఘటనలు

ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ బాపూజీ నగర్ లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. శ్రీకాంత్ నిఖిల దంపతులు తమ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, షార్ట్ సర్క్యూట్​తో మంటలు చెలరేగాయి. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు వస్తుండడంతో స్థానికులు గమనించి వెంటనే తలుపులు పగలగొట్టి నీళ్లతో ఆర్పివేశారు. ఈప్రమాదంలో ఇంట్లోనే వాషింగ్ మిషన్, కూలర్, ఫ్యాన్, టీవీ, ఫ్రిజ్, దుస్తులు, నిత్యావసరాలు కాలి బూడిదయ్యాయి. 

అల్వాల్: అల్వాల్​లోనూ ఇటువంటి ఘటనే జరిగింది. ఓల్డ్ అల్వాల్ పంచశీల కాలనిలో నివసించే సంతోష్ పాశ్వాన్ అతని భార్యతో కలిసి మార్కెట్​కు వెళ్లాడు. ఇంట్లో షార్ట్ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధం అయినట్లు బాధితులు తెలిపారు.