నడుస్తున్న కారులోంచి చెలరేగిన మంటలు.. కాలిబూడిదైన కారు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అగ్నిప్రమాదం జరిగింది.  నడుస్తున్న కారులోంచి ఒక్కసారిగా మంటలొచ్చాయి. దీంతో కారులో ఉన్న వారు భయాందోళనతో కారు దిగి పరుగులు పెట్టారు.. కారు ఇంజిన్ లోంచి వచ్చిన చిన్న మంటలు కారు మొత్తం మంటలు వ్యాపించాయి. ఇది స్థానికులు మంటలార్పేందుకు యత్నించారు కానీ సాధ్యం కాలేదు.. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థాలానికి చేరుకొని మంటలార్పారు.. అప్పటికే కారు మొత్తం మంటలు వ్యాపించడంతో పూర్తిగా తగలబడిపోయింది.. 

ALSO READ :ప్రయాణంలో వాంతులు వికారంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సమీపంలో నడిరోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ కారు పూర్తిగా దగ్దమైంది. నడిరోడ్డుపై కారు తగలబడటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.