రన్నింగ్ ప్యాసింజర్ వాహనంలో మంటలు.. కాలిబూడిదైన టాటా ఏస్

జాతీయ రహదారిపై రన్నింగ్ లో ఉన్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పొగలు అలుముకున్నాయి. ఈ ఘటన వరంగల్- హైదరాబాద్ హైవే జనగామ జిల్లా చిల్పూర్ మండలం వంగలపల్లి దగ్గర చోటు చేసుకుంది.

ఇంజన్ నుంచి పొగ రావడం గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపాడు.. ఆ తర్వాత అందులో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందికు దిగారు. దీంతో ప్రయాణికులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు వాహనం దిగిన కొద్దిసేపటికే టాటా ఏస్ నుంచి భారీగా మంటలు చెలరేగి.. వాహనం పూర్తిగా కాలిపోయింది. వాహనం నుంచి భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.