హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కింగ్ కోఠిలోని ఓ హాస్టల్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమయంలో హాస్టల్ లో బాయ్స్ ఎవ్వరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు పైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.