మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలోని SBI బ్యాంకులోఉన్నట్టుండి దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.. ఆదివారం (ఆగస్టు 25,2024) నాడు బ్యాంకులో చెలరేగిన మంటల్లో 6కంప్యూటర్లు మంటల్లో కాలిపోయాయి. పలు డాక్యుమెంట్లు దగ్ధమయ్యాయి.
ఆదివారం సెలవు దినం కావడంలో బ్యాంకు లో సిబ్బంది ఎవరూ లేరు.. బ్యాంకులోనుంచి దట్టమైన పొగలు వస్తుండటంతో గమనించిన స్థానికులు బ్యాంకు సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మంటలు వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది, కస్టమర్లు మంటలను అదుపులోకి తెచ్చారు.షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని బ్యాంకు సిబ్బంది అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.