ఫారెస్ట్​ గుట్టలపై ఎగిసిపడిన మంటలు

పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరా కాలనీ నుంచి శ్రీనివాస కాలనీ వరకు విస్తరించి ఉన్న ఫారెస్ట్ గుట్టలకు బుధవారం మంటలంటుకున్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలతో స్థానికులు ఏమవుతుందోనని భయపడ్డారు. 

ఇందిరా కాలనీ శివారు నుంచి పలువురు గుట్టలపై నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో వారి బంధువులు ఆందోళన చెందారు. అయితే అక్కడి వరకు మంటలు వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుట్టపైకి మేకలు, గొర్రెలు కాయడానికి వెళ్లేవారి వల్ల మంటలంటుకున్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని భద్రాచలం జాతీయ రహదారి నుంచి ఈ మంటలు పెద్దగా కనిపించడంతో పలువురు ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్​మీడియాలో షేర్​చేశారు.