బిగ్ బాస్ సీజన్–5 పూర్తయింది. విన్నర్‌తో పాటు రన్నరప్స్ కూడా ఇంటర్వ్యూలతో తీరిక లేకుండా ఉన్నారు. కానీ, టాప్–3 కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్ర మాత్రం ట్రీట్మెంట్తో బిజీ అయ్యాడు. బిగ్ బాస్ ఐస్ ఛాలెంజ్ టాస్కు తర్వాత.. ప్రియాంక శ్రీరామ్ కాళ్లపై వేడినీళ్లు పోసింది. దానివల్ల అతని పాదాల దగ్గరి చర్మం పూర్తిగా ఊడిపోయింది. బిగ్‌బాస్ ట్రీట్మెంట్ ఇప్పించినప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు శ్రీరామచంద్ర. దాంతో హౌస్ నుంచి బయటికొచ్చాక కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దానికి సంబంధించిన వీడియోని రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు ఈ సింగర్. ‘ నేను ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నా.. కొత్త చర్మం.. కొత్త లైఫ్.. మీ ప్రేమ’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. కొందరు బిగ్‌బాస్‌ని తప్పు పడుతున్నారు కూడా. వేడినీళ్లు పోస్తున్నప్పుడు 70 కెమెరాలు ఏం చేశాయి? బిగ్ బాస్ అప్పుడెందుకు మాట్లాడలేదు? టీఆర్పీ కోసం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారా? అని గట్టిగా అడుగుతున్నారు.