- నలుగురికి తప్పిన ప్రాణాపాయం
ఘట్కేసర్, వెలుగు: వరంగల్హైవేపై రన్నింగ్కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని ముందే పసిగట్టడంతో అందులోని నలుగురికి ప్రాణాపాయం తప్పింది. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన సాయికిరణ్ తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి మంగళవారం కారులో కొమురవెల్లికి బయలుదేరాడు.
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ ఫ్లైఓవర్ ఎక్కగానే కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించి కారులోని నలుగురు కిందకు దిగి పరుగులు తీయడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆపై కొద్ది నిమిషాల్లోనే మంటలు భారీగా ఎగసిపడి కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.